ద్రవిడ్, జహీర్‌ఖాన్‌ లకు షాక్!

టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జహీర్‌ఖాన్‌ లకు గట్టి షాక్ తగిలింది. ఇటీవల బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా నియమించబడ్డ ద్రవిడ్, జహీర్‌ఖాన్‌ లకు  అది మూన్నాళ్ల ముచ్చెటే అయ్యింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కోరినట్లే అసిస్టెంట్ కోచ్ గా సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ లను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. వీరిద్దరూ వచ్చే వరల్డ్ కప్ వరకూ కొనసాగుతారని స్పష్టం చేసింది. మరొకవైపు ఫీల్డింగ్ కోచ్ గా ఆర్ శ్రీధర్ నియామకం కూడా దాదాపు ఖరారైనట్లే కనబడుతోంది.

వీరి నియమాకంతో ప్రధాన కోచ్ రవిశాస్త్రి పంతం నెగ్గినట్టు అయింది. జహీర్‌ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్టు వచ్చిన వార్తలపై రవిశాస్త్రి బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో అనుభవజ్ఞుడైన భరత్‌ అరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని రవి పట్టుబట్టాడు. అతడి ఒత్తిడికి తలగ్గొడంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *