బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ సరిపోడు: రవిశాస్త్రి, కోచ్‌ల ఎంపికల్లో ఎన్నో ట్విస్ట్‌లు

విశాస్ర్తి టీమిండియా ప్రధాన కోచ్‌గా తొలిసారి ఎంపికకాగా జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా, రాహుల్‌ ద్రావిడ్‌ విదేశాల్లో బ్యాటింగ్‌ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే చీఫ్‌ కోచ్‌ విషయంలో సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ల క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్వ్యూలో రవిశాస్ర్తికి వీరేంద్ర సెహ్వాగ్‌ నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో కోచ్‌ ఎంపికలో ఒకింత సందిగ్దం ఏర్పడింది. అయితే కెప్టెన్‌ కోహ్లీ పట్టుబట్టడంతోపాటు ముంబైకి చెందిన శాస్ర్తివైపే సచిన్‌ కూడా మొగ్గుచూపడంతో అతని ఎంపిక అనివార్యమైంది. అయితే రవిశాస్ర్తిని ఎంపిక చేయాలంటే గంగూలీ ఒక షరతు విధించినట్టు తెలిసింది. బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ను నియమించాలని దాదా ప్రతిపా దించాడు. రవిశాస్ర్తి అండర్‌-19 క్రికెట్‌ ఆడిన రోజుల్లో అతడికి భరత్‌ అరుణ్‌ మంచి మిత్రుడు. అయితే వివాదరహితుడైన జహీర్‌కు సీఏసీ ఓకే చెప్పింది. ‘జహీర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమిం చేందుకు అంగీకరించిన తర్వాతే గంగూలీ కోచ్‌గా రవిశాస్ర్తి వైపు మొగ్గుచూపాడ’ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు. కాగా.. అవసరమై నపుడు.. అంటే ప్రత్యేకించి విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్‌ సలహాదారుగా ద్రావిడ్‌ను నియమించడం కూడా గంగూలీ ఎత్తుగడేనని తెలు స్తోంది. ఇదంతా రవి ఆధిపత్యాన్ని తగ్గించేందుకేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కామెం టేటర్‌ హర్ష భోగ్లే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
భరత్‌నే కోరుకుంటున్న రవి!
కోచ్‌ అయిన రెండు రోజుల్లోనే రవిశాస్ర్తి తనదైన శైలిలో పావులు కదుపుతున్నాడు. పాలకుల కమిటీ (సీవోఏ)తో శనివారం జరగనున్న సమావేశంలో అతడు భరత్‌ అరుణ్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించాలని కోరనున్నట్టు సమాచారం. ప్రధాన కోచ్‌గా తనకు సహాయ సిబ్బందిని ఎంచుకునే హక్కు ఉందంటు న్నాడు రవి. గతంలో రవి డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో భరత్‌ అరుణ్‌ టీమిండియాకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేకాదు బౌలింగ్‌ కోచ్‌గా ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుందని, అందుకు జహీర్‌ సిద్ధంగా ఉంటాడా లేడా.. అన్నది మరో వాదన. జహీర్‌ 100 రోజులకు మించి అందుబాటులో ఉండడని సమాచారం. కాగా ‘జహీర్‌ అంటే శాస్ర్తికి ఎంతో గౌరవం. కాకపోతే అతడు ఫుల్‌టైమ్‌ బౌలింగ్‌ కోచ్‌ను కోరుకుంటున్నాడు. జహీర్‌ కనుక పేస్‌ బౌలర్లుకు రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తే భరత్‌ దానిని అమలు చేస్తాడు. ఇదే విషయాన్ని శనివారం సీవోఏతో జరిగే భేటీ సందర్భంగా శాస్ర్తి ప్రస్తావించనున్నాడ’ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఇంటర్వ్యూ సందర్భంగా బౌలింగ్‌ కోచ్‌ విషయంలో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. భరత్‌ను శాస్ర్తి ప్రతిపాదించగా.. గంగూలీ తిరస్కరించాడట. దాంతో తనకు ఆసీస్‌ మాజీ పేసర్‌ గిలెస్పీ కావాలని శాస్ర్తి అడిగాడు. అదీ కుదరలేదు. ఇక బౌలింగ్‌ కోచ్‌గా వెంకటేశ్‌ ప్రసాద్‌ను స్టాండ్‌బైగా బీసీసీఐ ఉంచినట్టు సమాచారం.
జహీర్‌ పర్యటనల వారీగా..: ద్రావిడ్‌ మాదిరే బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ కూడా పర్యటనలవారీగానే సేవలు అందిస్తాడని బీసీసీఐ గురువారం తెలిపింది. జహీర్‌ పూర్తిస్థాయి బౌలింగ్‌ కోచ్‌ గా ఎంపిక చేసినట్టు రవిశాస్ర్తి నియామక ప్రకటన సందర్భంగా బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఇంతలోనే ఏమైందో తెలీదు.. బీసీసీఐ నుంచి ఈ ప్రకటన వెలువడింది. మొత్తంగా రవిశాస్ర్తి కోరినట్టుగానే అరుణ్‌ ప్రవేశానికి ఇది సూచికగా భావిస్తున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *