నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి

ఇకపై ద్విచక్ర వాహనంపై వెళ్ళే నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు హెల్మెట్ ధరించాలీ. మోటారు వాహనాల సవరణ చట్టం 2019 లోని 28 నిబంద్గలను సెప్టెంబర్  నెల నుండి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాల నియత్రణకు పాలనాపరమైన నిబంధలనే ఎక్కువగా అమల్లోకి తెస్తున్నారు. ట్రాఫిక్ నిబంధలను పాటించని వారిపై రూ.500 నుండి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే నిబంధనలు అమలు చేస్తారు. సీట్ బెల్టు పెట్టుకోకపోతే వెయ్యి రూపాయిల జరిమానా  విధిస్తారు. ఎక్కువ లోడ్ ఉన్న వాహనాలను నిలిపి వేసి 20 వేలు జరిమానా, మరియు అధిక లోడ్ దించే వరకు దాన్ని కదలనివ్వరు. ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 జరిమానా విధిస్తారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *