బిగ్ బాస్-3 ఎపిసోడ్-23 ఏం జరిగింది?

బిగ్ బాస్-3 ఎపిసోడ్ 23 బాబా భాస్కర్, రోహిణిల మధ్య సరదా సంభాషణతో మొదలయ్యింది. వితికా-వరుణ్‌లు ఎప్పటిలాగే ఒకే బెడ్‌పై ముచ్చట్ల మొదలుపెట్టారు. ఇక వరుణ్ వితికాను దగ్గరకు తీసుకుని ముచ్చట్లు చెబుతూ శ్రీముఖితో సరదాగా ఉండని సలహా ఇచ్చాడు. నేను మామూలుగానే ఉంటున్నానని.. అయితే ఆమె తనను నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్స్ నాకు నచ్చకపోవడంతో ఆమెతో ఫ్రీగా మూవ్ కాలేకపోతున్నానంటూ గారం చేసింది. దీంతో ఓకే బంగారం అంటూ ఆమె నుదిటిపై ఓ ముద్దు పెట్టి బుజ్జగించారు. వితికా వరుణ్ గుండెలపై వాలిపోయింది. ఇక తర్వాత ఈ వారం ఎలిమినేషన్ కాస్త డిఫరెంటుగా సాగింది. ఇద్దరు కంటెస్టెంట్లు కలసి వచ్చి వారిలో ఒకరు మాత్రమే నామినేషన్ అవ్వాలి. శ్రీముఖి ఇప్పటికే బిగ్ బాస్ వేసిన శిక్షకు గానూ నామినేషన్‌లో ఉంది.

మొదట రవి, వితికా లు వచ్చారు. వితికా రిక్వస్ట్ చేయాయడంతో రవి తనకు తను నామినేట్ అయ్యారు. తర్వాత రోహిణి, శివజ్యోతిలు వచ్చి ఒకే అభిప్రాయంతో శివజ్యోతి నామినేట్ అయ్యింది, రోహిణి సేవ్ అయ్యింది. వరుణ్, మహేష్.. జోడీగా వెళ్లగా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో నేనంటే నేను సేఫ్ అవుతా అని పోటీ పడతారు. కానీ చివరకు వరుణ్ నామినేట్ అయ్యాడు దీనికి మహేశ్ నేను నామినేట్ అయితే సేఫ్ అవుతానని నమ్మకం లేదని భయం ఉందని అందుకే వరుణ్ నామినేట్ అవుతాడని ప్రకటించారు.  బాబా భాస్కర్, అషు‌ రెడ్డిలు జంటగా వెళ్లగా.. నేనే నామినేట్ అవుతా అని స్వచ్ఛందంగా ప్రకటించారు బాబా భాస్కర్. హిమజ, రాహుల్‌లు జంటగా వెళ్లగా.. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఇంట్రాక్ట్ అవుతాడని అందుకే తనకు నచ్చలేదని రాహుల్‌ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది హిమజ. దీనితో రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు నాలుగో వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. ఈ ఏడుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు. నామినేషన్స్‌ గురించి ఒకరితో ఒకరు మాట్లాడినందుకు రోహిణిని నామినేట్ చేశారు బిగ్ బాస్. పునర్నవి, అలీలకు ఎలిమినేషన్‌ నుండి మినహాయింపు లభించింది. బక్రీత్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు విషెష్ చెప్పుకుండా డాన్స్‌లతో హంగామా చేశారు. అంతకు మందు బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్‌కి సంబంధించిన చిన్ననాటి ఫొటోలను, వారి ఫ్యామిలీ ఫొటోలను చూపించి సర్ ప్రైజ్ ఇచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *