బిగ్ బాస్ నుండి హిమజ అవుట్…

బిగ్ బాస్ తొమ్మిదోవారం నామినేషన్‌లో రాహుల్, హిమజ, మహేష్ విట్టాలు ఉండగా హిమజ ఎలిమినేట్ అయ్యింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రాహుల్‌ని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా నాటకం ఆడి చివర్లో ట్విస్ట్ ఇచ్చి రాహుల్‌ని ఫేక్ ఎలిమినేట్ అంటూ సీక్రెట్‌ రూంలో కూర్చోబెట్టారు నాగార్జున.

ఇక మిగిలిన హిమజ, మహేష్ విట్టాలలో హిమజ ఎలిమినేట్ అయినట్టుగా ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ప్రకటించారు. ఈ ఎలిమినేషన్ ను గద్దలకొండ గణేష్ చెప్పారు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఆదివారం నాడు ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు. ఆయనే హిమజ ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు. తనదైన స్టైల్‌లో డేరింగ్ డేషింగ్ అంటూ నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చింది హిమజ. ఈవారంలో హిమజ ఎలిమినేట్ అయ్యిందంటే ప్రధాన కారణం వితికానే. తొమ్మిదో వారం నామినేషన్‌లో వితికాను వరుణ్ రక్షిస్తే.. కెప్టెన్‌గా తనకు గల ప్రత్యక్ష అధికారంతో హిమజను ఎలిమినేషన్‌లోకి నెట్టి ఆమె హౌస్‌ నుండి బయటకు వెళ్లడానికి ప్రధాన కారణం అయ్యింది వితికా. ఈమెకు పునర్నవి కూడా సాయం చేయడం ఇద్దరూ కలిసికట్టుగా హిమజను హౌస్‌ నుండి ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యారు.

ఆ తర్వాత హిమజను నాగార్జున స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఆమెతో హౌస్ లోని కంటెస్టెంట్స్ కు గుడ్ ఎవరు? బ్యాడ్ ఎవరు అని వారి ఫోటోకు పెట్టించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *