అదృశ్యమైన కేఫ్ కాఫీ డే యజమాని

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘కేఫ్‌ కాఫీ డే’ సృష్టికర్త ఆయన. కాఫీ ప్రపంచంలో సరికొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చిన గొప్ప వ్యాపారవేత్త. కాఫీ సాగు కుటుంబంలో పుట్టి ‘కాఫీ కింగ్‌’ స్థాయికి ఎదిగిన వ్యక్తి.. ఒకప్పుడు సక్సెస్‌కు చిరునామా.. అయిన కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ అదృశ్యం సంచలనంగా మరింది. నిన్న సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ.. ఆ తర్వాత కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఏమయ్యారన్నది అంతు చిక్కకుండా పోయింది. మరోవైపు సిద్ధార్థ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వంతెనపై నుంచి నదిలోకి దూకి ఉంటారనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. కన్పించకుండాపోవడానికి ముందు సిద్ధార్థ తన కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు రాసిన లేఖే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ccd

‘37 ఏళ్లుగా ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేశాను. మన కంపెనీల్లో ప్రత్యక్షంగా 30 వేల మందికి, బయట మరో 20 వేల మందికి ఉపాధి కల్పించాను. కానీ ప్రస్తుతం ఎంత ప్రయత్నించినా వ్యాపారాన్ని లాభాల బాట పట్టించలేకపోతున్నాను. ఓ ప్రయివేటు ఈక్విటీలోని షేర్లను బైబ్యాక్‌ చేయమని వాటాదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నాను. ఇంతకు ముందు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డీజీగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. మీ అందరు నాపై ఉంచిన నమ్మకాన్ని కాదని వెళ్తున్నందుకు క్షమించండి. ఎవరిని మోసం చేయాలనేది, తప్పుదోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదు.  తప్పులన్నింటికీ నా ఒక్కడిదే బాధ్యత. నేను జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి నా టీమ్‌కు‌, ఆడిటర్లకు, మేనేజ్‌మెంట్‌కు తెలియదు.  మీరంతా కొత్త యాజమాన్యంతో కలిసి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓ వ్యాపారవేత్తగా నేను విఫలమయ్యాను. ఏదో ఒక రోజు మీరంతా నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని అనుకుంటున్నాన’ని సిద్దార్థ లేఖలో పేర్కొన్నారు.

 

 

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *