జూనియర్ ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన కేంద్ర సంస్థ

అనుకుంటాం కాని అప్పుడెప్పుడో మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు ఇప్పుడు మన మెడకు చుట్టుకుంటాయి. సరిగ్గా అలాంటి చిక్కులో పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జై లవకుశ మూవీ, బిగ్ బాస్ రియాలిటీ షో లో బిజీ బిజీ గా ఉన్న తారక్ కు ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. కాగ్ సంస్థ ఈ మధ్య వినోద రంగానికి సంబంధించి పన్ను లావాదేవీల్లో అవకతవకలు గుర్తించే పనిలో పడింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా రెమ్యునరేషన్ కి సంబంధించి ఎగవేతకు పాల్పడ్డాడని గుర్తించింది.

సర్వీస్ ఎక్స్ పోర్ట్ పాలసీ  కింద విదేశాల్లో షూటింగ్  జరిపిన నాన్నకు ప్రేమతో వస్తుంది కాబట్టి తనకు పన్ను వర్తించదు అని తారక్ అందుకు తగ్గ మినహాయింపు పొందాడు. ఆ సినిమాకు గాను దాదాపు 7 కోట్ల 33 లక్షల దాకా పారితోషికం అందుకున్నాడని అందులో పేర్కొన్నట్టు వార్త.

లండన్ కు చెందిన వైబ్రెంట్ లిమిటెడ్ విజువల్ లిమిటెడ్ ప్రొడక్షన్ కంపనీ నుంచి ఇది తీసుకున్నట్టు రిటర్న్స్ లో ఫైల్ చేసారు. ఐటి లో లొసుగులు ఆధారంగా కోటి పది లక్షల రూపాయల పన్ను మినహాయింపు పొందినట్టు నివేదికలో పేర్కొన్నారు. దీనికి రెవిన్యూ శాఖ త్వరలో ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వబోతోంది.

గతంలో రన్వీర్ కపూర్ కూడా ఎ దిల్ హై ముష్కిల్ సినిమాకు ఇలాగె ఎగవేతకు పాల్పడి 80 లక్షలకు పైగా ఎగవేసినట్టు గుర్తించారు. సదరు సినిమాల అగ్రిమెంట్, ప్రారంభోత్సవం, మిగిలిన కార్యక్రమాలు అన్ని ఇక్కడే జరిగి కేవలం ఔట్ డోర్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి మినహాయింపు కోరడం తప్పని కాగ్ పేర్కొంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *