సమంత-చైతు.. డెసిషన్ మార్చుకున్నారా?

కొన్ని రోజులుగా అక్కినేని ఫ్యామిలీపై తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. అక్కినేని వారసుల పెళ్లి సంగతులతో మొదలైన స్పీడ్.. రీసెంట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో మరింత పెరిగిపోయింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు నాగ్ తో సహా ఫ్యామిలీలోని ఎవరూ ప్రయత్నించకపోవడంతో.. చాలామంది ఇదే వాస్తవం అనే ఫీలింగ్ కి వచ్చేశారు.

ఈ పరిస్థితి నుంచి అర్జంట్ గా బయటకు వచ్చేందుకు ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నారట నాగ్. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఈ సిట్యుయేషన్ లో మార్పు వస్తుందని సిద్ధాంతులు చెప్పారట. దీంతో చైతు-సమంతలను తమ వివాహాన్ని ప్రీపోన్ చేసుకోవాల్సిందిగా సూచించారట నాగార్జున. ప్రస్తుతం ఇదే విషయంపై ఇద్దరూ తెగ చర్చలు జరిపేసుకుంటున్నారని అంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే.. వచ్చే ఏడాదిలో కానీ చైతు-శామ్ ల పెళ్లి జరగాల్సి ఉంది.

పెళ్లికి ముందు మరిన్ని సినిమా చేస్తానని శామ్ చెప్పడం.. పెళ్లి తర్వాత కంటిన్యూ చేసేందుకు మామ గారు నాగ్ నుంచి అనుమతి పొందడం జరిగిపోయాయి. కానీ పెళ్లి తర్వాత అవకాశాల విషయంలో సమంతకు క్లారిటీ బాగానే ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా వివాహాన్ని వచ్చే ఏడాదికి అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో మారిన పరిస్థితుల కారణంగా.. ముందుకు జరపాల్సి వస్తోంది. దాదాపుగా వీరిద్దిరి వివాహం ఈ ఏడాదే ఉండొచ్చని టాక్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *