వెంకీమామ మేకింగ్ వీడియో రిలీజ్

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’.  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. బాబీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు కథానాయకులు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. దీంతో అభిమానుల్లో జోష్‌ పెరిగింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. టీవల నెలరోజులపాటు కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని వచ్చిన చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతోంది. గత ఫిబ్రవరిలో తూర్పుగోదవారి జిల్లాలో గోదావరి ఒడ్డున ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనుంది. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *