విమానాశ్రయంలో ఎన్టీఆర్, చరణ్

రామ్ చరణ్.. ఎన్టీఆర్.. ఒకరు మెగా హీరో.. మరొకరు నందమూరి హీరో. వీరిద్దరూ కలిసి కనిపిస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఈ మధ్యన ఎక్కువయింది. రాజమౌళి డైరెక్షన్ లో వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ పై కనిపించనున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ హంగామా మరింత ఎక్కువగా ఉంది.

రీసెంట్ గా ఎన్టీఆర్- చరణ్ ఇద్దరూ కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చారు. ఇద్దరూ బ్యాగులు తగిలించుకుని ఎక్కడికో జర్నీ చేస్తున్నారు. వీరి వాలకం చూస్తే ఇద్దరూ కలిసే ప్రయాణం చేయబోతున్నారనే సంగతి అర్ధమవుతుంది. ఇంతకీ మెగా పవర్ స్టార్.. యంగ్ టైగర్ లు కలిసి ఎక్కడికి వెళుతున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. వీరంతట వీరేమీ సమాచారం చెప్పలేదు కానీ.. అసలు విషయం అయితే కలిసి నటించబోయే సినిమా కోసమే అంటున్నారు. వీరిద్దరితో ఓ వర్క్ షాప్ నిర్వహించేదుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడనే వార్తలు ఇప్పటికే వచ్చాయి.

అయితే.. ఈ వర్క్ షాప్ ఇండియాలో కాదట. అమెరికాలో ఉంటుందని.. అందుకే ఎన్టీఆర్- చరణ్ ఇద్దరూ కలిసి అక్కడకే బయల్దేరారని అంటున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఇద్దరూ ఇలా ఎయిర్ పోర్టులో కూడా దర్శనమిచ్చారు.  ఓ పది రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందట. అక్కడే ఓ ఫోటోషూట్ కూడా నిర్వహించే అవకాశాలున్నాయని.. సినిమా ప్రకటన సమయంలో ఈ ఫోటోలు బయటకు వస్తాయని టాక్ వినిపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *