తొలి రోజుకే మిలియన్ క్లబ్బా?

గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ బాగా విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో సైతం అతను మార్కెట్, ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు. ఒకప్పుడు మిలియన్ క్లబ్బును అందుకోవడమే పెద్ద టార్గెట్‌గా కనిపించేది ఎన్టీఆర్‌కు. కానీ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఏకంగా 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టింది.

తర్వాత ‘జనతా గ్యారేజ్’ కూడా 2 మిలియన్ క్లబ్బుకు చేరువగా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ కూడా అమెరికాలో భారీ వసూళ్లే సాధించేలా ఉంది. ఈ చిత్రాన్ని అక్కడ ఏకంగా 190 లొకేషన్లు.. 500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. భారీగా ప్రిమియర్లు కూడా వేస్తున్నారు.

కేవలం ప్రిమియర్లతోనే ‘జై లవకుశ’ 8 లక్షల డాలర్ల దాకా వసూలు చేయబోతున్నట్లు అంచనా. అంటే తొలి రోజు వసూళ్లతో కలిపితే గురువారానికే ఈజీగా మిలియన్ మార్కును దాటేస్తుందన్నమాట. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. వీకెండ్ అయ్యేసరికే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును దాటేసే అవకాశముంది.

ఈ చిత్రాన్ని యుఎస్‌లో రూ.8.5 కోట్లకు అమ్మారు. బయ్యర్ సేఫ్ జోన్లోకి రావాలంటే ఈ చిత్రం 1.6 మిలియన్ డాలర్ల మార్కును దాటాలి. ఐతే అదేమంత కష్టమైన విషయం లాగా అనిపించట్లేదు. ప్రిమియర్లకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ‘జై లవకుశ’ సేఫ్ జోన్లోకి రావడ గ్యారెంటీగా కనిపిస్తోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *