పాయల్ రాజ్ పుత్ పంట పండింది

తన మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ను షేక్‌ చేసిన అందాల భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ నెగెటివ్‌ రోల్‌ ఆకట్టుకున్నారు. తాజాగా ఈ భామకు మరో క్రేజీ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన తేజ తన తదుపరి చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌కు చాన్స్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్‌ నటించబోయేది హీరోయిన్‌గా కాదు. ఓ స్పెషల్ సాంగ్‌ కోసం ఈ బ్యూటీని తీసుకున్నాడట తేజ. గతంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలోనూ పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్ సాంగ్‌లో అలరించారు. ప‍్రస్తుతం ఆర్డీఎక్స్‌ లవ్‌ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాల్లో నటిస్తున్నారు పాయల్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *