నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ36: ఎన్నో ప్రయోజనాలు

శ్రీహరికోట: భారత అంతరికక్ష ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి బుధవారం ఉదయం సుమారు పదిన్నర గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ36(పీఎస్‌ఎల్వీ-సీ36) వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.

సోమవారం రాత్రి 10.25 గంటలకు నుంచి నిరంతరాయంగా కొనసాగిన కౌంట్‌డౌన్‌ పూర్తికాగానే రిసోర్స్‌శాట్‌-2ఎ అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ26 రాకెట్‌ మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహం వ్యవసాయానికి సంబంధించిన వివరాలను తెలియజేయనుంది. ఇది రైతులకు ఎంతో ఉపయోకరమైన సమాచారాన్ని అందజేస్తుంది.

వాతావరణ అధ్యయనానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ మంగళవారమే షార్‌ కేంద్రానికి చేరుకున్నారు. ప్రయోగాన్ని ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. 17నిమిషాల్లో రిసోర్స్ శాట్ -2ఏను కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *