సమంతపై రకుల్‌ షాకింగ్‌ కామెంట్స్‌….!

చిత్ర పరిశ్రమలో ఒక్కసారి ఏవరికైన స్టార్‌ డమ్‌ క్రియేట్‌ అయితే మామూలుగా ఉండదు. ఆ క్రేజ్‌తో సినీ ప్రేక్షకులు వాళ్లని బాగా గుర్తు పెట్టుకుంటారు. అంతే కాకుండా క్రేజ్‌ వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఎవరినైనా కామెంట్‌ చేసే కనీస అర్హత వారికి ఉంటుంది. దీంతో గతంలో తనని టార్గెట్ చేసిన వారిని వీరు టార్గెట్ చేయటం జరుగుతుంది. ఇలా సినీ పరిశ్రమలో, వివిధ రంగాల్లో జరుగుతుంటుంది.

అయితే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో స్టార్ హీరోయిన్ పై కామెంట్ చేయటం హాట్ టాక్స్ గా మారింది. తను కామెంట్ చేసింది ఎవరినో కాదు…అక్కినేని ఇంట కాబోయే కోడలు… స్టార్ హీరోయిన్ సమంతని. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్ తో ఇప్పుడు సమంత పొజిషన్ ఎక్కడ ఉంది? అనే డౌట్స్ ఇండ్రస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఇటీవలే ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ వ‌రుస‌పెట్టి మరి స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తుంది. ఆమె చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కి కొన్ని భారీ చిత్రాలలో ఆఫర్స్ వచ్చాయి. ఆ ఆఫర్స్ ని సమంత కావాలనే టార్గెట్ చేసి రానివ్వకుండా చేసిందట.

‘బ్రహ్మోత్సవం’ ‘ఆటోనగర్ సూర్య’మూవీలలో మొదటగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించాల్సి ఉండదా…చివరి నిముషంలో సమంత నటించింది. అయితే ఆ సినిమాలు ప్లాప్ అవ్వటంతో సమంత పూర్తిగా డల్ అయిందని చెప్పుకొచ్చింది రకుల్‌. అందుకే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్…సమంత ఆఫర్స్ ని కొల్లగొడుతుంది. “ప్రతి ఒక్కరికి ఒక్కోటైం ఉంటుంది. ఇప్పుడు నా టైం” అంటూ సమంతని టార్గెట్ చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ లా మారాయి.

ప్రస్తుతం ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరోలకు సంబంధించిన గొడవలే ఎక్కువ అనుకుంటే….ఇప్పుడు హీరోయిన్‌ల వంతు వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనప్పటీకి సమంతపై రకుల్‌ చేసిన కామెంట్స్‌ ఇండ్రస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి సమంత ఈ కామెంట్స్‌ పై ఏవిధంగా స్పందిస్తూందో వేచిచూడాల్సిందే మరి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *