శరవణ రాజగోపాల్ మరణానికి కారణం

శరవణ భవన్, సౌత్ ఇండియన్ భోజనానికి పెట్టింది పేరు.. ఇది జగమెరిగిన సత్యం. సౌత్ ఇండియా మరియూ ఇండియాలోనే కాదు, అమెరికా, ఐరోపా, కెనడా, దుబాయ్, ఆస్ట్రేలియా ఏ దేశం వెళ్ళిన మన సౌత్ ఇండియా ఇడ్లి, దోశ దొరకాలంటే శరవణ భవనే శరణం.

ఇంత పెద్ద చైన్ ఆఫ్ హోటళ్ళు స్థాపించిన శరవణ భవన్ యజమాని రాజగోపాల్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు, అతని మరణానికి కారణం అత్యాశకు పోయే ఎందరికో.. కనువిప్పు

లాంటిది, ఇంతకీ.. శరవణ రాజగోపాల్ మరణానికి కారణం ఏంటో తెలుసా..?

 

ఎందుకు జీవిత ఖైదు శిక్ష పడింది?…

1981 లో శరవణ భవన్ స్తాపించి అంచెలంచెలుగా ఎదిగిన రాజగోపాల్ కి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు. జ్యోతిష్యం బాగా నమ్మే రాజగోపాల్ కి మూడవ పెళ్లి చేసుకుంటే తనకు ఇంకా కలసోస్తుందని చెప్పాడట ఒక జ్యోతిష్యుడు. అది నమ్మిన రాజగోపాల్, తన దగ్గర పని  చేస్తున ఉద్యోగి కూతురు జీవజ్యొతిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పటికే వివాహిత అయిన జీవజ్యోతి దీనికి ఒప్పుకోలేదు, ఎలాగయినా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్, జివజ్యోతిని శారీరకంగా.. మానసికంగా దాడులు చేశారు. తను ఎంతకీ ఒప్పుకోకపోవడంతో, కోపోద్రేక్తుడైన రాజగోపాల్ 2001 లో జీవజ్యోతి భర్తను హత్య చేయించారు. జీవజ్యోతి భర్త అయిన శాంతకుమార్ కూడా శరవణ భవన్ ఉద్యోగే..

దీంతో కేసు విచారణ పూర్తి చేసిన మద్రాసు హైకోర్టు 2009 లో రాజగోపాల్ కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుండి ఆరోగ్య సమస్యలు సాకులు చూపి బెయిల్ పొందిన రాజగోపాల్, సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. కేసు పూర్వాపరాలు విన్న సుప్రీం కోర్టు కూడా క్రింది కోర్టు విధించిన శిక్షనే కరారు చేసింది. తన ఆరోగ్యం ఏమాత్రం భాగాలేదని రాజగోపాల్ మొరపెట్టుకున్నా.. ఈ సారి సుప్రీం ధర్మాసనం వినలేదు సరికదా, జులై 7 వ తేది 2019 నాడు సరెండర్ అవ్వాలని తేల్చేసింది. కాగా జులై 9 వ తేదిన సరెండర్ అయిన రాజగోపాల్ ఇప్పుడు అనారోగ్యం కారణంగా.. మరణించటం జరిగింది.

మనిషి ఆశాజీవి, ఆ ఆశే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కానీ ఆ ఆశే అత్యాశగా మారితే శరవణ భవన్ యజమాని రాజగోపాల్ మాదిరిగా తిరిగి ఆ ఉన్నత శిఖరాల నుండి, అతః పాతాళానికి పడిపోతారు. కాబట్టి ఆశ పడటం, కలలు కనటం వరకూ సరేకానీ… అత్యాశ,మూడనమ్మకాల జోలికి వెళ్ళకండి అని రాజగోపాల్ మరణం తెలియజేస్తున్నట్టుగా ఉంది కదూ…

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *