అమ్మ‌యిన స‌న్నీ లియోన్‌!

బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ అమ్మ‌యింది. సన్నీ లియోన్ కి పెళ్లయిన సంగతి తెలుసు కానీ.. గర్భవతి ఎప్పుడు అయింది.. ఎప్పుడు కనేసింది అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే అది బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం ద్వారా కాదు. స‌న్నీ, డేనియ‌ల్ వెబ‌ర్ దంప‌తులు 21 నెల‌ల పాప‌ను ద‌త్త‌త తీసుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని లాతూర్‌కు చెందిన ఆ పాపకు నిషా కౌర్ వెబ‌ర్ అని పేరు పెట్టారు. రెండేళ్ల కింద‌టే త‌మ‌కు ఓ పాప కావాల‌ని ఓ అనాథ శ‌ర‌ణాల‌యానికి అప్లై చేసుకున్నారు స‌న్నీ దంప‌తులు. మొత్తానికి ఇన్నాళ్ల‌కు వాళ్ల క‌ల నెర‌వేరింది. పాప‌ను చూసి వెబ‌ర్ తెగ మురిసిపోతున్నాడు. మొద‌టిసారి పాప ఫొటో చూడ‌గానే ఎంతో సంతోషం క‌లిగింది. భావోద్వేగానికి గుర‌య్యాను. మూడు వారాల్లో ఈ ప్రాసెస్‌ను పూర్తి చేశామ‌ని డేనియ‌ల్ వెబ‌ర్ చెప్పాడు.

అయితే పాప‌ను, ఆమెను తీసుకొచ్చిన అనాథాశ్ర‌మం పేరును మాత్రం త‌మ‌కు కూడా చెప్ప‌లేద‌ని స‌న్నీ చెప్పింది. ఇండియ‌న్ గ‌వ‌ర్న్‌మెంట్‌, కారా ఏజెన్సీ ఆ పాప‌ను మాకు అందించారు. అనాథాశ్ర‌మం ఎంపిక మ‌నం చేయ‌కూడ‌ద‌ని మాకు తెలియ‌దు. మేం అప్లై చేసుకున్నాక ప్ర‌భుత్వ‌మే ఓ అనాథ‌శ్ర‌మం నుంచి నిషాను మాకు ద‌త్త‌త‌గా ఇచ్చారు అని స‌న్నీ తెలిపింది. బాబ‌యినా, పాపయినా.. ఎవ‌రిని ఇచ్చినా పంజాబీ పేరే పెట్టాల‌ని సన్నీ మొద‌టి నుంచీ అనుకుంది. అనుకున్న‌ట్లే నిషా కౌర్ అని ఆ పాప‌కు పేరు పెట్టింది.మా ఇద్దరికే పుట్టిన బయోలాజికల్ చిల్డ్రన్ ఉండాలని మేము అనుకోలేదు. చాలా విషయాల్లో ఎడ్జస్ట్ కావాల్సి వస్తుందని తెలుసు. అయినా మేం అన్నిటికీ సిద్ధపడ్డాం. తనను 21 నెలలకే దత్తత తీసుకున్నాం కాబట్టి.. త్వరగా మాతో కలిసిపోతుందని అనుకుంటున్నా’ అని చెప్పింది సన్నీ లియోన్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *