బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా..
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. అవును, కానీ.. ఈవిడ మిల్కీ బ్యూటీ తమన్నా.. కాదు, తమన్నా సింహాద్రి ఒక ట్రాన్స్ జెండర్, సోషలిస్ట్. మీ టూ ఉద్యమం లో భాగంగా.. శ్రీరెడ్డికి సపోర్ట్ చేస్తూ.. కొన్ని కారణాల చేత విభేదాలు ఏర్పడి తిరిగి శ్రీరెడ్డి పైనే ఘాటైన కామెంట్లు కురిపించి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యిందీ తమన్నా సింహాద్రి.అటు ఏపీలో జరిగిన ఎన్నికల్లో.. లోకేష్ కు పోటీగా మంగళ గిరి నియోజవర్గం నుండి స్వతంత్య్ర అభ్యర్దిగా నిలబడి ఓడిపోయిందీ.. తమన్నా.. ఇప్పుడు తనే.. స్టార్ మా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది, బిగ్ బాస్ లోకి ఒక ట్రాన్స్ జెండర్ రావటం ఇదే మొదటి సారి, ఇప్పటికే.. మహేష్ విట్టాను రవి కృష్ణ అసభ్య పద జాలంతో పిలిచినందుకు అలాంటి వాటికి బిగ్ బాస్ లో తావు లేదని, రంగు,కులం,మతం బిగ్ బాస్ లో చూడబోరని చెప్పుకొచ్చాడు నాగార్జున,మరి ఒక ట్రాన్స్ జెండర్ తో ఇంటి సభ్యులు ఎలా మెదులుతారు?ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాల్సిందే…