పోలీసు వాహనాన్ని తీసుకెళ్లిపోయాడు

విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆది వారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వాహ నాలను తనిఖీలు చేసు న్నారు. హైవే మొబైల్‌ వాహనం డ్రైవర్‌ ఇంజిన్‌ ఆన్‌చేసి పెట్టి ఉంచడంతో గుర్తు తెలియని ఓ వ్యక్తి పోలీసు వాహనాన్ని తీసుకెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాహనం తాళం తిప్పి, ఇష్టమొచ్చినట్టు డ్రైవ్‌ చేశాడు. ఇలా రోడ్డుపై చక్కెర్లు కొడుతూ సుమారు రెండు కి.మీ. దూరం వెళ్లిన తరువాత వాహనం అదుపు తప్పి డివైడర్‌, హైవే పక్కన ఉన్న ఒక గోడను ఢీకొట్టి ఆగి పోయింది. వాహనం టైర్లు, ముందుభాగం దెబ్బతిన్నాయి. అయితే వాహ నంలో ఉన్న వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదునిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడికి మతిస్థిమితం లేదని గుర్తించారు. ఉన్నతాధికారుల సూచనతో అతడిని మానసిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వాహనాన్ని మతిస్థిమితం లేని వ్యక్తి తీసుకెళుతున్న సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *