సీఎం కేసీఆర్‌పై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం  చేయని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న కేసీఆర్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి .. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఏపీలో సీఎం కేసీఆర్‌లాంటి నాయకత్వం లేనందుకు బాధపడుతున్నానని చెప్పారు. కాజిపేటలో నిర్వహించిన బాలవికాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణారెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకుని వారికి కేసీఆర్‌ వెన్నుదన్నుగా నిలవడం శుభపరిణామన్నారు. పాలనలో ఏపీకి తెలంగాణకు పొంతన లేదన్నారు. ఏపీలో పేదలను పట్టించుకునే పరిస్ధితి లేదని … అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మీడియా మేనేజ్ మెంట్ తప్ప సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు.

గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గరి నుంచి కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మెచ్చుకున్నారు. కేసీఆర్‌ పనితీరును ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలోని మిగితా రాష్ట్రాలకు ఆదర్శమని వెల్లడించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై అధ్యయనం కూడా చేశాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *