యాంకర్ అనసూయ కారుకు అనంతపురం జిల్లాలో యాక్సిడెంట్

బుల్లితెర యాంకర్ అనసూయ కారుకు అనంతపురం జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది. జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో జాతీయ రహదారిపై అనసూయ కారును మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో అనసూయ తలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం అయిన కారును ఘటనా స్థలంలోనే వదిలి, వేరొక కారులో అనసూయ రాప్తాడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. స్వల్పగాయాలైన అనసూయను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *