బిగ్ బాస్-3 లో టాలెంట్ షో…పర్ఫమెన్స్ తో అదరగొట్టిన కంటెస్టెంట్స్

బిగ్ బాస్‌-3 ఎపిసోడ్ లో బిగ్ బాస్ టాస్క్‌ లో భాగంగా టాలెంట్ షో నిర్వ‌హించారు. బాబా భాస్క‌ర్‌, శ్రీముఖి జ‌డ్జ‌ెస్‌గా ఉండగా.. కంటెస్టెంట్స్ ఆట, పాట, యాక్టింగ్‌లతో ఒకర్ని మంచి ఒకరు పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక డాన్స్‌ తో ఇరగదీసేందుకు రంగంలోకి దిగిన పునర్నవి ‘పిల‌గా ఇర‌గ ఇర‌గ’ సాంగ్‌కి మాస్ స్టెప్పులతో డాన్స్‌ తో ఇర‌గేస్తే. డాన్స్ అయిన త‌ర్వాత జ‌డ్జ‌స్ బాబా భాస్క‌ర్‌, శ్రీముఖీలు పునర్నవిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. నా జీవితంలో ఇదే ప‌స్ట్ టైమ్‌. చిన్న‌ప్ప‌టి నుంచి నేను డాన్స్ చేస్తే మ‌మ్మీ డాడీ తిడతారని  వాళ్లు బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు నేను త‌లుపులు వేసుకుని డాన్స్ చేసేదాన్ని. అంటూ అషూ.. జిల్ జిల్ జిల్ జిగేలురాజా సాంగ్‌కి అదిరిపోయేలా డాన్స్ చేసింది. ప‌ర్ఫామెన్స్‌ జ‌డ్జ‌స్‌కి న‌చ్చితే ఆపిల్‌ఫిజ్ బాటిల్ ఇవ్వ‌చ్చు అన్న బిగ్ బాస్ రూల్ ప్ర‌కారం.. అషూకి ఫిజ్ ఇస్తారు.

వితికా ఒక క‌ళ్లు లేని అమ్మాయిలా న‌టించి.. క‌ళ్లు డొనేట్ చెయ్యండి అని ఇచ్చిన ప‌ర్ఫామెన్స్ ఇంటి స‌భ్యుల్లో భావోధ్వేగాల‌ను రేకెత్తిస్తే.. శివ‌జ్యోతి అగ్గి పెట్టెలో చీర ప‌ట్టిస్తా.. గార‌డీ చేస్తా.. మ్యాజిక్ చేస్తానంటూ.. అంద‌రి ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లుతూ న‌వ్వుతెప్పించింది. ఇక తర్వాత వ‌చ్చిన హిమ‌జ‌.. ఓ చ‌క్క‌నోడా సాంగ్ సాంగ్‌ని త‌ప్పు త‌ప్పుగా పాడుతూ.. ఆగి ఆగి పాడుతూ.. అంతా న‌వ్వుతుంటే ఆగండి ఇంకా ఉంద‌ని మ‌ధ్య‌లో మాట్లాడుతూ పాట‌పాడింది. పాట పూర్త‌య్యాక అయిపోయింద‌ని హిమ‌జా చెప్ప‌డంతో మ‌జా మ‌జా హిమ‌జా అంటూ జేజేలు కొట్టారు హౌస్ మెంబ‌ర్స్‌.

ఇక రాహుల్ ఏమైపోయావే సాంగ్ మొద‌లు పెట్టి.. రెండు సార్లు ఆగిపోతాడు. నేను పాడ‌లేను గివ్ అప్ అన‌డంతో అంతా ఎంక్రేజ్ చేస్తారు. పాడు రాహుల్‌.. నువ్వో సింగ‌ర్ అయ్యి ఉండి పాడు పాడ‌క‌పోతే ప‌రువు పోతుంది రాహుల్ అంటుంది శ్రీముఖి. అయినా రాహుల్‌ పాడ‌ను అన‌డంతో ప్రిపేర్ అయ్యి లాస్ట్‌ లో పాడు అనడంతో అందుకు స‌రే అంటాడు రాహుల్‌. తర్వాత మహేష్ బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పి అందరిని మెప్పిస్తాడు. మొత్తానికి పాటను బాగా ప్రిపేర్ అయి వ‌చ్చిన రాహుల్ మ‌ళ్లీ ప‌ర్ఫెక్ట్‌ గా పాడి `శ్రీముఖి చేతుల్తో ఆపిల్‌ఫీజ్‌ని సొంతం చేసుకున్నాడు. మిగిలిన ప‌ర్పామ‌ర్స్‌ వ‌రుణ్ సందేష్ ఉండిపోరాదే అంటూ సాంగ్ పాడ‌గా.. ర‌వి బ్లాక్ బాస్ట్ బ్లాక్ బాస్ట‌రే సాంగ్‌కి అమ్మాయి అబ్బాయి గెట‌ప్‌తో వ‌చ్చిన ర‌వి త‌న‌దైన స్టెప్స్ వేసి మెప్పుపొందాడు. ఇక‌ అలీ స్వింగ్‌జ‌రా పాట‌తో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేసి పిచ్చెక్కించాడు. అలీ డాన్స్‌ కి ఫిదా అయిన శ్రీముఖీ ఆపిల్‌పీజ్ బాటిల్స్ అన్నీ అందిస్తూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *