ప్రియాంకారెడ్డి హత్య కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణ

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డిని బుధవారం రాత్రి షాద్‌నగర్‌ హైవేలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులు.. ఏ–1 మహమ్మద్‌ ఆరిఫ్‌ (26), ఏ–2 జొల్లు శివ (20), ఏ–3 జొల్లు నవీన్‌ (20), ఏ–4 చింతకుంట చెన్నకేశవులు (20)లను పోలీసులు అదుపులోకి తీసుకొని షాద్‌నగర్‌ పీఎస్‌కు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టి కస‍్టడీకి కోరనున్నారు.
శుక్రవారం రాత్రంతా నిందితులను విచారించారు. విచారణలో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడు నారాయణపేట జిల్లా పొర్లకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు

ప్రియాంకరెడ్డి హత్యను నిరసిస్తూ మహిళలు, ప్రజాసంఘాలు, విద్యార్థిలోకం కదంతొక్కింది. శనివారం ఉదయం శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు భారీగా చేరుకున్న విద్యార్థులు ప్రియాంకకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. . పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.  శంషాబాద్‌కు చేరుకున్న విద్యార్థి, ప్రజా సంఘాలు.. పోలీస్ స్టేషన్ నుంచి ప్రియాంక ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసి శిక్షించాలని, ప్రియాంకు న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు.  చేసినట్లుగా  ప్రియాంకారెడ్డి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు కాసేపటి క్రితమే ప్రియాంక ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *