హద్దు మీరొద్దు.. మాటలు జాగ్రత్త.. ధనుష్‌కు హీరోయిన్ షాక్..

తమిళ హీరో ధనుష్‌కు మలయాళ ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ షాక్ ఇచ్చింది. హద్దు మీర వద్దు జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె హెచ్చరించడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే సుచీలీక్స్ వివాదం, ధనుష్ తన కుమారుడేననే పిటిషన్ దాఖలైన నేపథ్యంలో తాజాగా మడోన్నాతో వివాదం వార్తలకు ఎక్కింది. ప్రేమమ్ చిత్రంతో మడోన్నా సెబాస్టియన్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పవర్ పాండీ చిత్ర షూటింగ్ సమయంలో ధనుష్, మడోన్నా మధ్య ఎదో చిన్న ఘర్షణ చిలికి చిలికి పెద్దగా మారిందట. ఈ వ్యవహారంలో ధనుష్ ప్రవర్తనతో మడోన్నా మనస్తాపం చెందినట్టు సమాచారం. ఈ విషయంపై ధనుష్ ఏదో వ్యాఖ్యానించగా అందుకు మడోనా ధీటుగా సమాధానం ఇచ్చినట్టు తమిళ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి.

తమ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంపై మడోన్నా తీవ్ర స్థాయిలో ఓ సందేశాన్ని పంపించినట్టు తెలిసింది. ‘హద్దు మీరి మాట్లాడొద్దు.. జాగ్రత్త’ అనే మెసేజ్‌ను ధనుష్‌కు పంపించినట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే దక్షిణాదిలో గుర్తింపు పొందుతున్న మడోన్నా ఈ విధంగా వ్యవహరించడంపై కొందర్ని షాక్ గురిచేసినట్టు తెలుస్తున్నది.

ధనుష్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పవర్ పాండీ చిత్ర ప్రమోషన్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాదం అనేక రూమర్లకు ఊతమిస్తున్నదనే విమర్శ తమిళ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నది.

ఇంతకీ వారి మధ్య ఏం జరిగింది. ఎందుకు మడోన్నా తీవ్రంగా స్పందించింది. వివాదాలకు దూరంగా ఉండే ధనుష్ ఎమన్నారు.. మడోన్నా పంపిన మెసేజ్ ఏంటీ.. అది బయటకు ఎలా వచ్చింది. దానిపై రూమర్లు ఎందుకు వెలుగు చూస్తున్నాయనేది అంతు పట్టని విషయంగా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *