ఆ హీరోకి పవర్ స్టార్ సర్ ప్రైజ్ విష్..!

కమెడియన్లు హీరోగా మారుతున్న ఈ టైంలో ఆ ప్రయత్నంలో ముందడుగేశాడు కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్ రెడ్డి. తను హీరోగా చేసిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కమర్షియల్ గా హిట్టా కాదా అన్నది పక్కన పెడితే సినిమాలో శ్రీనివాస్ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా గురించి అందరు దాదాపు మర్చిపోయిన క్రమంలో సడెన్ గా ఆ సినిమాని విష్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీటింగ్ పంపించాడు.

pawan-gift
pawan-gift

సినిమాలు తక్కువ చూసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆ సినిమా చూశారట.. ఇక తన తరపునుండి విషెష్ పంపించడం జరిగింది. మంచి సినిమా చేశావు.. సినిమా చూసి ఎంజాయ్ చేశాను.. నీకు నా బెస్ట్ విషెష్ అంటూ పవర్ స్టార్ లెటర్ తో పాటు గులాబి బొకే కూడా పంపించారు. ఇక పవన్ విషెష్ గ్రేట్ గా ఫీల్ అయిన శ్రీనివాస్ రెడ్డి దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. చేసింది చిన్న ప్రయత్నమే అయినా స్టార్ దృష్టిని ఆకర్షించడంతో తన ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి. ప్రస్తుతం మళ్లీ హీరోగా శ్రీనివాస్ రెడ్డి కథా చర్చల్లో పాల్గొంటున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *