పల్లెటూరి పిల్ల: ‘రంగస్థలం 1985’లో సమంత లుక్ ఇదే

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి కుర్రాడిగా, సమంత పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటికే ‘రంగస్థలం 1985’ సెట్స్ నుండి రామ్ చరణ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. సమంత లుక్ ఎలా ఉంటుందనేది బయటకు రాలేదు. తాజాగా సమంతనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తన ఫోటో పోస్టు చేసింది.

అలసట, బాధ పెద్ద విషయం కాదు, కెమెరా కేవలం అద్భుతాన్నే చిత్రీకరిస్తుంది… అనే క్యాప్షన్‌తో ఈ ఫోటో పోస్టు చేశారు సమంత. లంగావోణీ ధరించి, ఓ పల్లెటూరి అమ్మాయిలా కాలువగట్టుపై కూర్చొని ఉన్న ఈ ఫోటోలో సమంత వెనక వైపు నుండి మాత్రమే కనిపిస్తోంది.

 2018 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాతి బరిలో మెగాస్టార్ నిలిస్తే…. 2018 సంక్రాంతి బరిలో రామ్ చరణ్ ఇతర హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వనున్నాడన్నమాట. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *