AP తోలి బడ్జెట్ సంక్షేమానికే పెద్ద పీట…..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిగారి ప్రభుత్వం  ప్రవేశపెట్టిన తొలి బడ్జేట్ సంక్షేమానికే పెద్ద పీట వేసింది. పేదల వైద్యానికి భరోసా, రైతులకు అండదండ, పేదలకు మద్దతు, మహిళలకు చేయూత, వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు ఆసరా, విద్యార్దులకు ఆపన్నహస్తం ఇలా అన్ని వర్గాల వారికీ నచ్చే విధంగా రాష్ట్ర బడ్జేట్ నిలిచింది.

అసెంబ్లీలో శుక్రవరం ఆర్దికమంత్రి బుగ్గాన రాజేంద్రనధారెడ్డి రూ. 2,27,297 కోట్లతో 2019-2020 ఆర్దిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతులకు అండగా వారి ఉన్నతికి కృషి చేయాలనే దిశగా రైతు భరోసకు రూ.      8,750 కోట్లు కేటాయించారు. తద్వారా పెట్టుబడి సాయం కోసం అక్టోబర్‌లో ప్రతి రైతుకూ రూ.12,500 కేటాయించనున్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు సున్నా వడ్డీతో కేటాయింపులు చేపట్టనున్నారు. వైఎస్సార్ రైతు బీమా ద్వారా ప్రీమియం చెల్లించేందుకు రూ. 1,163 కోట్లు కేటాయించారు. పాడిరైతులను ప్రోత్సహించడం కోసం వారికీ లీటరు పాలకు రూ. 4 బోనస్ కల్పించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు రూ. 200 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణానికి రూ. 9785.75 కోట్లు కేటాయించారు.

 

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లు గౌరవవేతనం రూ.3వేల నుంచి రూ.10వేలు పెంచారు. మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.12వేల నుంచి రూ.18వేలు పెంచారు. హోంగార్డుల వేతనం రూ.18 వేల నుంచి రూ.21,300 చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవవేతనం రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వెయ్యి రూపాయలు పెంచారు.  న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల నిమిత్తం రూ.1150 కోట్లు కేటాయించారు. పింఛన్‌దారులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.15,813.51 కోట్లు కేటాయించడంతో పింఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. విద్యను ప్రోత్సహించే  అమ్మవడి పధకానికి రూ. 32,168 కోట్లు కేటాయించారు. పేదలకు ఉచితంగా రూ. వెయ్యి వైద్యం అందించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకానికి రూ. 1,740 కోట్లు కేటాయించారు. రూ.5 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ  ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139 కోట్లు కేటాయించారు. తెలుగు గంగ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, గాలేరి–నగరి పథకాలకు ప్రాధాన్యత దక్కింది. గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపు నిధులు దక్కాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *