జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రు ? నాకు తెలియ‌ద‌న్న స్టార్ డైరెక్ట‌ర్‌

దివంగ‌త లెజెండ్రీ హీరో, మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు మనవడిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చినా, వైవిధ్యమైన నటనతో, కేక పుట్టించే డైలాగ్ డెలివరీతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్. తెలుగు, తమిళ పరిశ్రమల్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు.

టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ఇప్ప‌టికే చాలా మంది డైరెక్ట‌ర్ల పేర్లు కూడా వినిపించాయి. ఈ నందమూరి హీరోతో సినిమాలు చేయాలని చాలామంది డైరెక్టర్లు ఆసక్తి చూపుతుంటారు. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ గురించి తనకు తెలియదని ఓ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ డైరెక్ట‌ర్ సౌత్ ఇండియాలోనే క్రేజీ డైరెక్ట‌ర్ కావ‌డం విశేషం. సింగం సీరిస్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా సౌత్ ఇండియాలో సూప‌ర్ పాపులారిటీ ఉన్న సింగం హ‌రి తాజా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సింగం 3 ప్రమోషన్ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. అందులో ఎంతవరకూ నిజముందని యాంకర్ అడిగిన ప్రశ్నకు హరి సమాధానమిచ్చాడు.

అస‌లు త‌న‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి తెలియదని, తననెప్పుడూ కలవలేదని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే, హరి తన తదుపరి చిత్రం చియాన్ విక్రమ్‌తో ఉంటుందని ప్రకటించాడు. హ‌రి సినిమాలు తెలుగులో సైతం రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ తెలియ‌ద‌ని చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలు సైతం హ‌రిపై మండిప‌డుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *