టెక్కీ శ్రీనివాస్ భార్యకు లైన్ క్లియర్: అమెరికా కంపెనీ ఉదారత

హ్యూస్టన్:అమెరికాలో హత్యకు గురైన తెలుగు ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు అండగా నిలబడేందకు ఆయన పనిచేసే కంపెనీ ముందుకు వచ్చింది.శ్రీనివాస్ కలలను విజయవంతం చేసేందుకుగాను తనకు సహకరించాలని సునయన అమెరికాలోనే కోరారు.అయితే ఈ మేరకు గార్మిన్ కంపెనీ ముందుకు వచ్చింది.

సునయన తిరిగి అమెరికా వచ్చేందుకు వీలుగా ఇమ్మిగ్రేషన్ పత్రాల కోసం న్యాయ సహయం చేసేందుకు ముందుకు వచ్చింది ఆ కంపెనీ. శ్రీనివాస్ హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో పనిచేసేందుకుగాను వెళ్ళాడు. అమెరికాలోని గార్మిన్ అనే కంపెనీలో ఆయన పనిచేసేవాడు.శ్రీనివాస్ సునయనను వివాహం చేసుకొన్నాడు.వివాహం తర్వాత సునయన హెచ్ 4 వీసాతో శ్రీనివాస్ అమెరికా తీసుకెళ్ళాడు.

అమెరికాలో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ మరణించాడు. సునయన తిరిగి అమెరికా వెళ్ళేందుకుగాను అవకాశం లేదు. అయితే సునయన శ్రీనివాస్ అంత్యక్రియల తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళేందుకు వీలుండదు. ఈ విషయాన్ని ఆమె అమెరికాలో ఉన్నప్పుడే నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పింది . గార్మిన్ కంపెనీ తాను మళ్ళీ అమెరికాలో వచ్చేందుకు శ్రీనివాస్ కలలను నెరవేర్చుందుకు తాను ఎంచుకొన్న రంగంలో విజయవంతమయ్యేందుకు సహయపడాలని కోరారు.

శ్రీనివాస్ కు హెచ్ 1 బీ వీసా ఉంది, సునయనకు హెచ్ 4 వీసా ఉంది, శ్రీనివాస్ లేనందున సునయన తిరిగి అమెరికా వెళ్ళడం కష్టమే. అయితే సునయన అమెరికా వచ్చేందుకు వీలుగా తగిన వీసా సిద్దం చేసేందుకుగాను గార్మిన్ న్యాయ ప్రతినిధులు వాళ్ళ ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉచితంగా న్యాయ సహయం అందించేందుకుగా బ్రయాన్ కేవ్ అనే న్యాయసంస్థ సహ పలు సంస్థలు ముందుకు వచ్చినట్టు గార్మిన్ హెచ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మినార్ట్ చెప్పారు.

శ్రీనివాస్ సహ భారత్ మరికొన్ని దేశాలకు చెందిన ఉద్యోగులు తమ కంపెనీలో పనిచేసేందుకు వీలుగా గార్మిన్ కంపెనీ స్పాన్సర్ షిప్ అందించింది. ఇప్పుడు సునయనకు కూడ తాము అన్ని రకాలుగా సాయం చేస్తామని ఆమె అమెరికాలోనే ఉండి పనిచేసుకొనేందుకుగాను అవకాశం కల్పిస్తామని గార్మిన్ ప్రతినిధులు చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *