మరిసారి ఆయుధ పరీక్ష…

ఉత్తర కొరియా మరోసారి ఆయుధ పరీక్షలను నిర్వహించింది. ఆ దేశ నేత కిమ్‌ జొంగ్‌ ఉన్‌ శనివారం కొత్త ఆయుధ పరీక్షలను స్వయంగా పర్యవేక్షించారని ఆ దేశ మీడియా కొరియన్‌ సెంట్రల్‌న్యూస్‌ ఏజన్సీ(కేసీఎన్‌ఏ) వెల్లడించింది. అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు సాగిస్తున్న దక్షిణ కొరియాతో చర్చలు జరిపేది లేదని, ఇకపై అమెరికాతో మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది. అమెరికాతో త్వరలో చర్చలు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకన్నా ముందే ఉత్తర కొరియాతో అణు నిరాయుధీకరణ ఒప్పందం చేసుకోవాలనే దిశగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ గట్టి పట్టుదలతో ఉన్న క్రమంలో తాజా పరిణామాలు చేసుకున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *